ప్రజలకు మరో గుడ్ న్యూస్ ఇన్నాళ్లు విపరీతంగా పెరుగుతున్న స్టీల్, ఐరన్ ధరలు మరోసారి తగ్గనున్నాయి. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఒక్కసారిగా స్టీల్ ధరలు పెరిగాయి. దీంతో జనాలపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా భవన నిర్మాణాలు, ఐరన్, స్టీల్ ఆధారిత పరిశ్రమలపై భారీగా ఎఫెక్ట్ కనిపించింది.
ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పెట్రోల్, డిజిల్ పై కేంద్ర ఎక్సైజ్ టాక్సులు తగ్గిస్తున్న సమయంలో ఉక్కు పరిశ్రమకు అవసరం అయ్యే ముడి పదార్ధాల దిగుమతి పై సుంకాన్ని తగ్గిస్తున్నట్లు తెలిపింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆకాశాన్ని అంటుతున్న స్టీల్ ధరలు దిగిరానున్నాయి. ఇదిలా ఉంటే స్టీల్ ధరలు మరో 10-15 శాతం తగ్గే అవకాశం ఉందని ఇంజినీరింగ్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్( ఈఈపీసీ) ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల 10 శాతం, సెకండరీ ఉత్పత్తులు 15 శాతం తగ్గుతాయని అభిప్రాయపడింది. ప్రస్తుతం టన్ను స్టీల్ ధర రూ 82,000గా ఉంది.