Ukraine Crisis : లాభాల్లో దూసుకుపోతున్న స్టాక్‌మార్కెట్లు

-

ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులతో విరుచుకుపడుతోంది. ఇప్పటికే రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను చుట్టుముట్టారు. ఇక స్వాధీనం చేసుకునేందుకు సిద్ధం ఉంది. ఇప్పటికే.. ఉక్రెయిన్‌ దేశంలోని.. 83 స్థావరాలను స్వాధీనం చేసుకుంది రష్యా.

ఈ విషయాన్ని స్వయంగా రష్యా నే ప్రకటించింది. అయితే.. ఉక్రెయిన్‌ క్రైసీస్‌ నేపథ్యంలో.. నిన్న ఇండియాలో స్టాక్‌ మార్కెట్లు కుప్ప కూలాయి. కానీ.. ఇవాళ మాత్రం ఇండియాలో మెరుగైన పరిస్థితులు నెలకొన్నాయి. లాభాల్లో స్టాక్‌మార్కెట్లు కొనసాగుతున్నాయి. ఏకంగా… 1200 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్ కొనసాగుతుండగా… 350 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ఉంది.

ఇవాళ సాయంత్రం వరకు స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగే ఛాన్స్‌ ఉన్నట్లు ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.ఇది ఇలా ఉండగా.. ఇండియా లో బంగారం ధరలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1370 పెరిగి రూ. 51,550 కు చేరింది. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1250 పెరిగి రూ. 47,250 గా ప‌లుకుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version