పిల్లలు పనులను వాయిదా వేస్తున్నారా? తల్లిదండ్రులుగా ఈ పనులు చేయండి

-

వాయిదా వేయడం అనేది ఒక రోగం లాంటిది. తొందరగా పోదు. ఒక్కసారి వాయిదా వేయడం అలవాటైందంటే ప్రతీసారీ అదే గుర్తుకొస్తూ ఉంటుంది. ఇది పిల్లల్లో కూడా కనిపిస్తే జాగ్రత్త వహించాల్సిందే. మొక్కై వంగనిదే మానై వంగునా అంటారు. అందుకే వాయిదా వేసే లక్షణాలు పిల్లల్లో కనిపించినపుడు తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకుని దాన్నుండి బయటపడేయాలి. దానికోసం ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

 

అసలు వాయిదా వేయడం ఎలా అలవాటు అవుతుంది?

దీనికి ప్రధాన కారణం మోటివేషన్ లేకపోవడమే. వ్యక్తిగత క్రమశిక్షణ, సరైన దృష్టి, సమయపాలన లేకపోవడం కూడా కారణమే అయినప్పటికీ, వీటన్నింటికీ మూలం మోటివేషన్ లేకపోవడమే.

పిల్లల్లో వాయిదా లక్షణాలు కనిపిస్తే తీసుకోవాల్సిన చర్యలు

ప్రశ్నించండి

పనులు వాయిదా వేయడానికి గల కారణాలను ప్రశ్నించండి. ఎందుకు పూర్తి చేయడం లేదో దాని వెనక కారణాలను కనుక్కోండి.

పరిష్కారం

కారణాలు కనుక్కున్న తర్వాత దానికి పరిష్కారాలు వెతకండి. ఏం చేస్తే పిల్లల్లో మోటివేషన్ ని, బోర్ డమ్ ని తగ్గించవచ్చో తెలుసుకోండి.

వాస్తవ గమ్యాలను నిర్దేశించండి

అనవసర, అర్థం లేని, అర్థం కాని, వాస్తవానికి దూరంగా ఉండే గమ్యాలను పెట్టుకోవద్దని తెలపండి. ఈ విషయంలో పిల్లలకు తల్లిదండ్రులు సాయపడాలి. వాస్తవానికి దూరంగా ఉండే గమ్యాల వల్ల పిల్లల్లో ప్రేరణ తగ్గిపోతుంది.

వాళ్ళమీద ఎక్కువ బరువు ఉంచవద్దు

అవసరమైన దానికంటే ఎక్కువ బరువు పెట్టడం వల్ల దాన్ని దించేసుకుని, పోనీలే అన్న ఆటిట్యూడ్ పెరుగుతుంది.

పొగడాలి

వారు ఏదైనా సరిగ్గా చేసినపుడు ఆ విషయంలో వాళ్ళని పొగడాలి. అది వాళ్ళకి మంచి ఎనర్జీ బూస్టర్ గా పనిచేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version