56 రకాల నైవేద్యాలు ఈ దేవుడికి ప్రత్యేకం ఎక్కడో తెలుసా?

-

దేవుడు అంటే కేవలం పూజలేకాదు.. ఆయా క్షేత్రాలలో అక్కడ సమర్పించే నైవేద్యాలు బాగా ప్రాచుర్యం పొందాయి. అటువంటి వాటిలో తిరుపతి లడ్డు, శబరిమల డబ్బాలో ప్రసాదం, షిరిడి కోవ, ఇలా ఆయా క్షేత్రాలలో సమర్పించే నైవేద్యాలు ప్రసిద్ధి చెందాయి. అలాగే
పూరీలో జగన్నాథునికి నివేదించే నైవేద్యాలు ప్రత్యేకమే. ఇక్కడ వెలసిన జగన్నాథుడిని నీలమాధవుడి ఆరాధిస్తారు. స్వామి వారికి 56 నుండి 64 రకాల పిండి వంటలను నివేదిస్తారు. ఇక్కడ వంటను సాక్షాత్‌ మహాలక్ష్మీదేవి అదృశ్య రూపంలో పర్యవేక్షిస్తుంటుందట, అందుకే అన్న ప్రసాదాలు అంత రుచికరంగా ఉంటాయని అక్కడి వారి విశ్వాసం. గంగ, యమున బావుల్లోని నీటిని ప్రసాదాల తయారీకి వాడతారు. జగన్నాథునికి ఛప్పన్న (56) ప్రసాదాలను, రోజుకు ఆరుసార్లు నివేదిస్తారు. పూరీలో జగన్నాథ స్వామికి నివేదించే ఛప్పన్న బోగాలేమిటి వాటి తయారీకి ఉపయోగించే పదార్థాలు.

1. అన్నం

2. కనికా (బియ్యం, నెయ్యి, పంచదారతో తయారు చేస్తారు)

3. దొహి పొఖాళొ (నీట్లో నానిన అన్నానికి పెరుగు కలిపి తయారు చేస్తారు)

4. ఒద్దా పొఖాళొ (నీట్లో నానిన అన్నానికి అల్లం కలుపుతారు)

5. తీపి కిచిడీ (బియ్యం, పెసరపప్పు, నెయ్యి, పంచదారతో చేస్తారు)

6. నేతి అన్నం 7. కిచిడీ

8. మిఠా పొఖాళొ (నీట్లో నానిన అన్నానికి పంచదార కలుపుతారు)

9. ఒరియా పొఖాళొ (బియ్యం, నెయ్యి, నిమ్మరసం, ఉప్పుతో చేస్తారు)

10. కాజా 11. గొజ్జా (గోధుమపిండి, నెయ్యి, పంచదారతో చేసే మిఠాయి)

12. లడ్డు 13. మగజా లడ్డు (గోధుమపిండితో చేసే లడ్డు)

14. జీరాలడ్డు (గోధుమపిండికి జీలకర్ర చేర్చి తయారు చేసే లడ్డు)

15. వల్లభ (గోధుమపిండితో చేసే ఒక ప్రత్యేక మిఠాయి)

16. ఖురుమా (గోధుమపిండి, పంచదార, ఉప్పుతో చేస్తారు)

17. మొథాపులి (మినుములు, నెయ్యి, పంచదారతో చేస్తారు)

18. కకరా (గోధుమపిండి, కొబ్బరికోరు, పంచదారతో చేస్తారు)

19. మరిచి లడ్డు (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు)

20. లుణి ఖురుమా (గొధుమపిండి, నెయ్యి, ఉప్పుతో చేస్తారు)

21. సువార్‌ పిఠా (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు)

22. చొడెయి లొడా (గోధుమలు, నెయ్యి, పంచదారతో చేస్తారు)

23. ఝిలి (వరిపిండి, నెయ్యి, పంచదారతో చేస్తారు)

24. కొంటి (వరిపిండి, నెయ్యితో చేస్తారు)

25. మండా (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు)

26. ఒమాళు (గోధుమపిండి, నెయ్యి, పంచదారతో చేస్తారు)

27. పూరీ 28. లుచి (వరిపిండి, నెయ్యితో చేస్తారు)

29. బొరా (మినప్పప్పుతో చేసే వడలు)

30. దొహిబొరా (పెరుగు గారెలు)

31. అరిసె 32. త్రిపురి (వరిపిండి, నెయ్యితో చేస్తారు)

33. రొసాపాయిక (గోధుమలతో చేస్తారు)
34. ఖిరి (పాయసం)

35. పాపుడి (పాలమీగడ, పంచదారతో చేస్తారు)

36. కోవా
37. రొసాబొళి (పాలు, పంచదార, గోధుమలతో చేస్తారు)
38. తడియా (తాజా పనీర్, నెయ్యి, పంచదారతో చేస్తారు)

39. ఛెనాఖాయి (తాజా పనీర్, పంచదార, పాలతో చేస్తారు)

40. బపుడి ఖొజా (పాలమీగడ, నెయ్యి, పంచదారతో చేస్తారు)

41. ఖువా మండా (పాలు, గోధుమపిండి, నెయ్యితో చేస్తారు)

42. సొరాపులి (పాలను గంటల తరబడి మరిగించి చేసే మిఠాయి)

43. డల్లి (కందిపప్పుతో చేసే ముద్దపప్పు) 44. ముగొడల్లి (పెసరపప్పు వంటకం)
45. బిరిడల్లి (మినుములతో చేసే పప్పు) 46. ఉరద్‌ డల్లి (మినప్పప్పు వంటకం)

47. దాల్మా (కందిపప్పు, కాయగూరలు కలిపి చేసే వంటకం)

48. మవుర్‌ (పప్పులు, కొర్రలతో చేసే వంటకం)

49. బేసొరొ (కలగూర వంటకం) 50. సగొ (తోటకూర వంటకం)

51. పొటొలొ రొసా (పొటల్స్‌/పర్వల్‌ కూర)
52. గొటి బైగొణొ (గుత్తివంకాయ కూర)

53. ఖొటా (చింతపండు గుజ్జు, బెల్లంతో చేసే లేహ్యం)

54. రైతా (పెరుగులో కూరగాయల ముక్కలు వేసి చేస్తారు)

55. పిఠా (గోధుమపిండితో చేసే తీపిరొట్టె) 56. బైగని (వంకాయలతో చేసే వంటకం)
ఇవి ప్రధానంగా పూరి జగన్నాథ ఆలయంలో సమర్పించే నైవేద్యాలు. వీటి రుచి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమృతంలాగా ఉండే ఈ నైవేద్యాలు నిత్యం కొత్త కుండల్లో వండటం మరో ప్రత్యేకత. కుండమీద కుండ పెట్టి వాటిని వండుతారు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version