ఆన్లైన్ క్లాసుల విషయంలో ఇప్పుడు టీచర్లు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఎదుర్కొంటున్నారు అని ఒక టీచర్ మీడియాకు వివరించారు. యుపిలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఇంగ్లీష్ బోధిస్తున్న గుంజన్ శర్మ, గత నెలలో ఆమె ఒక క్లాస్ చెప్తున్నా సమయంలో ఒక అపరిచితుడు స్క్రీన్ పై కనిపించగా ఆమె షాక్ అయ్యారని ఒక టీచర్ పేర్కొన్నారు. ఎవరైనా క్లాసులో ఉన్న వారు అతనికి లింక్ షేర్ చేసారని మేము భావించాం అని ఆమె వివరించారు.
ఆ తర్వాత తరగతులను ఒక వారం పాటు నిలిపివేయవలసి వచ్చిందని అన్నారు. ఇక ప్రతి విద్యార్థి వారి ఖాతాను ఫోటోలు మరియు పూర్తి పేర్లతో అప్‌డేట్ చేయమని కోరారని చెప్పారు. ఆ తర్వాత వారు ఒక్కొక్కరిగా ఆన్లైన్ క్లాసు లో చేరడానికి వస్తారని ఆమె చెప్పారు. కొంత మంది అసభ్యకర ప్రవర్తనతో కూడా ఉన్నారని, దీనితో తాము మానసిక ఒత్తిడికి గురవుతున్నామని, కొందరు విద్యార్ధులకు బట్టలు కూడా ఉండటం లేదని, తల్లి తండ్రుల అసభ్య ప్రవర్తన ఎక్కువైందని ఆవేదన వ్యక్తం చేసారు.