రాష్ట్రంలో కార్లపై ఎర్రబుగ్గలు వినియోగించే వారు ఉన్నారని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హై కోర్టు ఆదేశించింది. కాగ కొత్త గా వెహికల్ చట్టం ప్రకారం కార్లకు ఎర్రబుగ్గలు ఉపయోగించడం నేరం అని అన్నారు. నూతన విహికల్ చట్టానికి విరుద్ధంగా ఎవరూ ఎర్రబుగ్గలు వాడినా.. కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హై కోర్టు సూచించింది. కాగ ఎర్ర బుగ్గల వినియోగంపై మహాబూబ్ నగర్ జిల్లా న్యాయవాది భావనప్ప హై కోర్టులో పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్ ను సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మసనం విచారణ చేపట్టింది. ఈ విచారణలో హై కోర్టు ఎర్రబుగ్గ వినియోగం పై కీలక వ్యాఖ్యలు చేసింది. వాహనాలకు ఎర్రబుగ్గల వినియోగాన్ని 2017 లోనే నిషేధించారని గుర్తు చేసింది. అయినా.. కొంత మంది రాజకీయ నాయకులు, అధికారులు ఈ ఎర్రబుగ్గను వినియోగిస్తున్నారని ధర్మసనం తెలిపింది. అలాంటి వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.