వాహనదారులకు వాతలు పెట్టడానికి సిద్దమైన పోలీసులు.. ఇలా చేస్తే మీ పని అంతేనట.. ?

-

ఇప్పటికే నగరంలో రోజు రోజుకు పెట్రేగిపోతున్న వాహన చోదకుల వేగానికి కళ్లెం వేయడానికి సైబరాబాద్‌ పోలీసులు ట్రాఫిక్‌ నియమాలను కఠినంగా అమలు చేస్తున్నారన్న విషయం తెలిసిందే.. ఇందులో భాగంగా రైడర్‌కు హెల్మెట్‌ తప్పనిసరి, ఇక బైక్‌కు సైడ్‌ మిర్రర్‌లు ఉండాలంటూ ఇదివరకు చేసిన ప్రచారంతో వాహనదారుల్లో కాస్త మార్పు కనిపిస్తోందట.. అదే సమయంలో అనుమతి పత్రాలు లేకుండా వాహనాలు నడుపుతున్న మైనర్ల, యువకుల భరతం పడుతున్నారు. అంతే కాకుండా ఒకే బైక్‌పై ముగ్గురు ప్రయాణించడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసే వారిని పట్టుకునేందుకు వాహన చోదకులు ఊహించని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఇక గతంలో లైసెన్స్‌ లేకుండా వాహనం నడిపితే పోలీసులు జరిమానా విధించి వదిలేసేవారు. కానీ కొద్ది నెలల నుంచి వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని ఆ వాహనాలను కోర్టులో అప్పచెబుతున్నారు.. అందుకే వాహనం కావాలనుకున్న వారు మరుసటి రోజు ఉదయం బండి ధ్రువపత్రాలు, ఫొటోలు తీసుకుని న్యాయస్థానంలో హాజరై జరిమాన కట్టి వాహనాన్ని విడిపించు కోవాలి.. అందుకే అందరూ తప్పక లైసెన్సును తమ దగ్గర ఉంచుకోవాలని ఇప్పటికే అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. కూడళ్ల వద్ద సైన్‌ బోర్డుల్లోనూ ఈ విషయాన్ని తెలియచేస్తున్నారు.. ఇక మరికొన్ని కఠినమైన నియమాలను విధించారు..

 

ఒకవేళ వీటిని ఉల్లంఘిస్తే కఠిన శిక్షలే ఉంటాయని పేర్కొంటున్నారు.. అవేంటో ఒక సారి చూస్తే.. ఎవరైనా లైసెన్సు లేకుండా తొలిసారిగా పోలీసులకు చిక్కితే.. వారి వాహనం స్వాధీనం చేసుకుని, తర్వాతి రోజు న్యాయస్థానంలో వాహనదారుడిపై చార్జిషీట్‌ దాఖలు చేస్తారు. అప్పుడు కోర్టు సమయం పూర్తయ్యే వరకూ న్యాయస్థానం ప్రాంగణంలోనే నిలబడి జరిమానా చెల్లించాలి. ఇది మొదటి తప్పుకు పనిష్మెంట్.. ఇక రెండోసారి పోలీసులకు దొరికితే.. 48 గంటలపాటు జైల్లో ఉంచుతారట..

 

ఇక మూడోసారి చిక్కితే మాత్రం రెండు రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజుల జైలుశిక్షతో పాటుగా భారీగా జరిమానా చెల్లించాలి. కానీ దీని ప్రభావం భవిష్యత్తులో విద్యార్థులకు ఉద్యోగాలకోసం విదేశాలకు వెళ్లే వారి పైన తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.. ఇంతే కదా అనుకోకండి ఒకవేళ ఐదు, అంతకంటే ఎక్కువసార్లు గానీ దొరికారంటే మాత్రం వారం రోజుల జైలుశిక్ష అనుభవించాలి, భారీ జరిమానా కూడా చెల్లించాలట.. ఇకపోతే ఆయా కోర్టులు జరిమానాను పోలీసుల నివేదిక అధారంగా నిర్ణయిస్తాయట.. సో వాహనాలు నడిపే వారు ఇకనుండి ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకోవాలని తెలుస్తుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version