సోషల్ మీడియాను జవాబుదారీగా మార్చడానికి కఠిన చట్టాలు: అశ్విని వైష్ణవ్

-

సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్ ,ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ,యూట్యూబ్ మొదలైన వాటిలో  ఇష్టం వచ్చినట్లు తప్పుడు సమాచారం, నకిలీ వార్తలను పోస్ట్ చేసిన కఠిన చర్యలు తీసుకునేలా, వాటికి జవాబుదారీగా ఉండేలా ప్రభుత్వం చట్టాలను తీసుకువస్తుందని ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం రాజ్యసభకు పేర్కొన్నారు.ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన ఆయన ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాలలో తప్పుడు వార్తలు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయని తెలిపారు. కాబట్టి దీనిని కట్టడి చేయడానికి మధ్యవర్తిత్వ నిబంధనలను సవరిస్తున్నట్లు తెలిపారు.

చాలా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు  సురక్షితంగా మార్చడానికి అందరితో సంప్రదింపులు జరుపుతున్నామని అశ్విని వైష్ణవ్ తెలిపారు.మరోక ప్రశ్నగా సమాధానంగా మాట్లాడుతూ, నకిలీ పోస్ట్‌లను తొలగించడంలో ఆయా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఇంకా డిజిటల్ ఎకనామి సిస్టం కోసం ఒక సంస్థాగత ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తున్నాము అని తెలిపారు. ఇంకా వాటిలో  మూడు భాగాలు ఉన్నాయి – మొదటిది కొత్త చట్టాలను కలిగి ఉంది. టెలికాం బిల్లును , వ్యక్తిగత డిజిటల్ డేటా రక్షణ బిల్లును ఈ సభ ఆమోదించింది అని  పేర్కొన్నారు. మరొక బిల్లు గురించిన ప్రక్రియ నడుస్తుందని అన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌కు  నుంచి ఎదురయ్యే ప్రతికూల సమస్యలను పరిష్కారాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది గుర్తు చేశారు. దీని కోసం మరింత కఠిన చట్టాలను రూపొందించుకోవాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version