టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిననాటి నుంచి ఆ సంస్థను గాడిలో పెట్టడానికి చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆక్యూపెన్సీ పెంచేందుకు ఇప్పటికే పలు రకాల నిర్ణయాలు తీసుకున్నారు సజ్జనార్. ఈ క్రమంలో రేట్లు పెంచి.. ప్రయాణీకులపై కాస్త భారం కూడా వేశారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షితం.. సుఖవంతం అంటూ పాత ట్యాగ్‌లైన్‌ను కాస్త గట్టిగా జనంలోకి తీసుకెళ్తున్నారు. తాజాగా విద్యార్థుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు సజ్జనార్. దూర ప్రాంతాల నుంచి నగరంలోని పలు కళాశాలలకు వచ్చే విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జారీ చేసిన బస్‌పాస్‌లను పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ఉపయోగించుకునేందుకు అనుమతించారు సజ్జనార్.
శివారు ప్రాంతాల నుంచి ఎంతోమంది స్టూడెంట్స్ సిటీలోని కాలేజీలు, స్కూళ్లకు వచ్చి చదువకుంటున్నారు. వీరు ప్రతిరోజూ డైలీ సర్వీస్ చేస్తుంటారు. అయితే ప్రజంట్ వారికి TSRTC జారీ చేసిన పాసులు కేవలం సిటీ బస్సుల్లోనూ చెల్లుతున్నాయి. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఆ పాసులు చెల్లుబాటు అవ్వడం లేదు. నగర శివారు ప్రాంతాలకు ఎక్కువ సంఖ్యలో సిటీ బస్సులు వెళ్లడం లేదు. దీంతో ప్రేవేట్ వాహనాలు ఆశ్రయిస్తుండంటంతో విద్యార్థులపై భారం పడుతుంది. ఈ క్రమంలో స్టూడెంట్స్‌తో పాటు వారి పేరెంట్స్ నుంచి సంస్థకు పెద్ద ఎత్తున రిక్వెస్టులు వచ్చాయి. ఆపై రివ్యూ చేసిన అనంతరం సిటీ బస్‌పాస్ ఉన్న స్టూడెంట్స్.. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులోనూ ట్రావెట్ చేసేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు ఆర్టీసీ అధికారులు.