ఆదివాసీ మహిళా ఎమ్మెల్యే కోవా లక్ష్మిపై ఉట్నూరు సబ్ కలెక్టర్, ITDA ఇంచార్జ్ PO యువరాజ్ మార్మాట్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై మహిళా ఎమ్మెల్యే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సబ్ కలెక్టర్ తనకు క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. వాంకిడి గురుకుల విద్యార్థిని శైలజ మృత దేహంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టగా వారితో మాట్లాడేందుకు ఎమ్మెల్యే కోవా లక్ష్మి అక్కడకు వెళ్లారు.
అదే సమయంలో అక్కడకు వచ్చిన ఉట్నూరు సబ్ కలెక్టర్, ITDA ఇంచార్జ్ PO యువరాజ్ మార్మాట్ ఈ ఘటనపై స్పందిస్తూ..‘మీ అమ్మాయి చనిపోయింది.మీకే ఇబ్బంది అవుతుంది. ఆమెకు(ఎమ్మెల్యే) ఏం కాదు. ఆమె వచ్చింది. వెళ్లిపోతుంది.. నేను మీ కోసం వచ్చాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.