బుల్లితెరపై రీ ఎంట్రీ ఇస్తున్న సుడిగాలి సుధీర్.. ఫ్యాన్స్ కి పండగే..!

-

బుల్లితెర మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ జబర్దస్త్ ద్వారా భారీ పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇటీవల ఈయన నటించిన గాలోడు సినిమా కూడా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. గతంలో సినిమాలలో నటిస్తూ డేట్స్ కుదరకపోవడం వల్ల జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ , ఢీ వంటి కార్యక్రమాలకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు సినిమా విజయవంతం సాధించడంతో చాలా సంతోషంగా ఉన్న ఈయన మళ్ళీ టీవీ రంగంలోకి ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలోని ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ 15 డాన్స్ షోలోకి సుధీర్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. కిరాక్ డాన్స్ పర్ఫామెన్స్ లతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న ఈ కార్యక్రమం ఇప్పుడు మరో కొత్త సీజన్లోకి అడుగుపెట్టబోతోంది. వచ్చే ఆదివారం నుంచి ఢీ 15 కార్యక్రమానికి ఈటీవీ శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో ఆదివారం కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుదేవా రాబోతున్నారు .

ప్రస్తుతం ఈ డాన్స్ షో తెలుగులోనే కాదు సౌత్ ఇండియాలోనే అతిపెద్ద డాన్స్ షోగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రతి బుధవారం ఢీ కార్యక్రమం ఈటీవీలో ప్రసారమవుతుంది.. కాబట్టి సుధీర్ ని మల్లెమాల టీం ఒప్పించి మరీ ఎంట్రీ ఇప్పిస్తోంది. ఈ మేరకు మంచి ఆఫర్ కూడా అందజేస్తుందంటూ సమాచారం . సుదీర్ తో పాటు ఈ కార్యక్రమంలో రష్మీ , యాంకర్ ప్రదీప్ కూడా ఉంటారని సమాచారం. ఏది ఏమైనా ఢీ కార్యక్రమానికి రియంట్రీ ఇస్తున్నాడు అంటే త్వరలోనే జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో కూడా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version