సుకుమార్ కీలక ప్రకటన చేశారు. “పుష్ప-3 ఖచ్చితంగా ఉంటుంది”.. సైమా వేదికపై సుకుమార్ ఈ ప్రకటన చేశారు. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా రష్మిక, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్, ఉత్తమ గాయకుడిగా శంకర్ బాబు.. మొత్తం ఐదు విభాగాల్లో పుష్ప-2కు అవార్డులు దక్కాయి. ఈ క్రమంలో సైమా వేదికగా ‘పుష్ప-3’పై క్లారిటీ ఇచ్చారు సుకుమార్.

‘పుష్ప-3’ ఉంటుందా అని అడిగిన యాంకర్ ప్రశ్నకు.. ఖచ్చితంగా ఉంటుందని సమాధానం ఇచ్చిన సుకుమార్… ఈ మేరకు ప్రకటన చేశారు.
- దుబాయ్ వేదికగా సైమా అవార్డ్స్ వేడుకలు..
- ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా రష్మిక
- ఉత్తమ చిత్రంగా కల్కి, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్
- ఉత్తమ నటుడు (క్రిటిక్స్) తేజ సజ్జా, ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్) ప్రశాంత్ వర్మ