విజయవాడలో సీతారామం మూవీ బృందం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ.. నా గోదావరి మూవీ కంటే సీతారామం సినిమా క్లాసిక్ అవుతుందన్నారు. నా లైఫ్ లో మొదటిసారి కీలకమైన సహాయక పాత్ర చేస్తున్నానని.. ఈ సపోర్టింగ్ రోల్ చేయడం నాకు గర్వంగా ఉందని వెల్లడించారు.
సినిమా స్క్రిప్ట్ బాగా నచ్చిందని.. సపోర్టింగ్ రోల్ ట్రెండ్ సౌత్ లో వచ్చిందని తెలిపారు. నటుడు అన్ని రోల్స్ చేయాలని మా తాతగారు చెప్పారని.. ఆగష్టు 5న ఈ మూవీ వస్తోందని వివరించారు. హీరో దుల్కర్ సాల్మన్ మాట్లాడుతూ.. మా సినిమా హిట్ టాక్ విజయవాడలో ప్రారంభమౌతుందని ఆశిస్తున్నా..మహానటి సమయంలో నా కాలు ఫ్రాక్చర్ అయింది.. అందుకే ప్రొమోషన్ కి రాలేదన్నారు.
చాలా పెద్ద క్లాసిక్ సినిమా అవుతుంది ఇదన్నారు.హీరోయిన్ మృణాల్ మాట్లాడుతూ.. ఈ సినిమాతో నన్ను గుర్తు పెట్టుకుంటారు.. దుర్గమ్మ దర్శనం చేసుకుని నా కెరీర్ ప్రారంభిస్తున్నానని వెల్లడించారు. ఇక్కడ నుంచీ నా కెరీర్ ప్రారంభించడం సంతోషమన్నారు.