భూమిపై అడుగుపెట్టిన సునీతా విలియమ్స్

-

సునీతా విలియమ్స్ వచ్చేశారు. సురక్షితంగా భూమిపై అడుగుపెట్టారు సునీతా విలియమ్స్. 9 నెలల పాటు అంతరిక్షంలో గడిపిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లు ఎట్టకేలకు భూమిపైకి వచ్చేశారు. భారత కాలమానం ప్రకారం మార్చి 19 తెల్లవారు జామున 3:27 గంటలకు స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ డ్రాగన్ అనే వ్యోమనౌక లో వీరు సురక్షితంగా భూమి మీద అడుగుపెట్టారు.

Sunita Williams To Undock From Space Station

ఈ క్రూ డ్రాగన్ ఫ్లోరిడా తీర ప్రాంతంలోని సముద్ర జలాల్లో సేఫ్ గా ల్యాండ్ అయింది. దీంతో దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్‌ గా మారాయి. 2024 జూన్ 5న స్టార్ లైనర్ వ్యోమనౌకలో ఐఎస్ఎస్ వెళ్లారు సునీత, విల్మోర్.. ఆ సమయంలో వారం రోజుల్లో తిరిగి రావాల్సి ఉంది సునీత, విల్మోర్.

కానీ సాంతికేక సమస్యతో గతంలో ఖాళీగా తిరిగొచ్చింది వ్యోమనౌక స్టార్ లైనర్. దీంతో 288 రోజులు అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు సునీత, బుచ్ విల్మోర్.. మూడో అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు సునీత.. 2006, 2012లోనూ అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన సునీత..తాజాగా భూమిపైకి వచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version