ప్రముఖ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళీ అరెస్ట్ పై ప్రముఖ నిర్మాత, నటుడు అశోక్ కుమార్ స్పందించారు. ఆయన ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పోసాని అరెస్ట్ పై మాట్లాడారు. పోసాని హద్దులు దాటి మాట్లాడారు. ఒక్కోసారి ఆయన మాటలు, బూతులు వింటుంటే నాకే కోపం వచ్చింది. అసలు ఈయనకు ఎందుకు అనిపించేది. రాజకీయంగా చేసే విమర్శలు వేరు.. వ్యక్తిగతంగా చేసే విమర్శలు వేరు. ఈయన రెండో దారి ఎంచుకొని లిమిట్స్ క్రాస్ చేశారు.
చాలా సార్లు ఫోన్ చేసి మీకెందుకు అండి అని అడగాలనిపించింది. కానీ కుదరలేదు. ఇప్పుడు ఆయన ఖర్మ అనుభవిస్తున్నారు. ఒక రాజకీయ పార్టీ పక్కనుందని ఎప్పుడూ కూడా చెలరేగొద్దు. ఇప్పుడు ఆయన కష్టాల్లో ఉన్నారు. ఆ పార్టీ కాపాడుతుందా..? రాజకీయాల్లో పదవుల కోసం క్యారెక్టర్ ను కోల్పోవద్దు. ఆర్టిస్ట్ గా పుట్టడమే గొప్ప విషయం. ఆయన దానిని దాటి క్యారెక్టర్ కూడా కొత్త కష్టాలు కొని తెచ్చుకొన్నారని అశోక్ కుమార్ చెప్పుకొచ్చారు.