మాజీ మంత్రి, వైఎస్ సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు మరో మలుపు తిరిగింది. అది కూడా రాజకీయ రంగు పులుముకోవడం గమనార్హం. 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కడప జిల్లా పు లివెందులలోని తన సొంత ఇంట్లోనే వివేకా హత్యకు గురయ్యారు. అప్పట్లోనే తీవ్ర సంచలనం సృష్టిం చిన ఈ కేసును అధికార టీడీపీ, ప్రతిపక్షం వైసీపీలు ఎన్నికల్లో బాగానే వాడుకున్నాయి. అయితే, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని అప్పట్లో వైసీపీ అధినేత జగన్ డిమాండ్ చేయడం గుర్తుండే ఉంటుంది. రాష్ట్ర ప్ర భుత్వంలో ఉన్న చంద్రబాబు వెంటనే సిట్‌ను ఏర్పాటు చేసినా.. జగన్ దానిపై తనకు నమ్మకం లేదంటూ.. సీబీఐకి డిమాండ్ చేశారు.
కానీ, చంద్రబాబు సీబీఐకి అప్పగించలేదు. మీరంటే మీరే హత్య చేయించారని ఇరు పక్షాలు ఎన్నికల స మయంలోనే దీనిని రాజకీయంగా వాడుకున్నాయి. ఇక, కోర్టు జోక్యంతో ఈ విషయాన్ని రాజకీయాల నుంచి తప్పించినా.. ఇప్పటికీ ఈ కేసుకు బాధ్యులు ఎవరనే విషయం గోప్యంగానే ఉండిపోయింది. ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉంది కనుక ఈ కేసు ఊపందుకుంటుందని అందరూ అనుకున్నారు. అంతేకాదు, జగన్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారని ప్రభుత్వం నుంచి సంకేతాలు కూడా అందాయి.
గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను కూడా జగన్ మార్చి తన హయాంలో మరో రెండుసిట్‌లు ఏర్పాటు చేశారు. అయితే, కొన్ని రోజులు ఈ కేసు వేగంగానే విచారణ జరిగినప్పటికీ. తర్వాత మాత్రం మందగించింది. గతం లో సీబీఐ విచారణ కోరుతూ.. వివేకా సతీమణి సౌభాగ్యమ్మ.. వైసీపీ అదినేత జగన్ కూడా హైకోర్టును ఆశ్ర యించారు. ఇప్పుడు వైసీపీనే ప్రభుత్వంలో ఉన్నప్పటికీ.. మేం బాగానే విచారణ చేస్తున్నాం.. అనే కోణం లో చెబుతూ.. సీబీఐకి ఇవ్వడం లేదు.
దీంతో ఈ కేసుపై అనేక అనుమానాలు పెను భూతాలై ఆవహించా యి. తాజాగా..వివేకా కుమార్తె డాక్టర్ సునీత మరోసారి సీబీఐ కోరుతూ.. హైకోర్టును అభ్యర్థించడం, ఈ కేసులో అనుమానితుల పేర్లు(వీటిలో అన్ని పార్టీలు అంటే వైసీపీ, టీడీపీ, బీజేపీ) బయట పెట్టడం సంచలనంగా మారింది. ఈ పరిణామం వైఎస్ వివేకా కుటుంబానికి ఎంత మేలు చేస్తుందనే పరిస్థితిని పక్కన పెడితే.. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న రాజకీయ సంక్లిష్ట పరిస్థితిని మరింత తీవ్రం చేసింది. ఇప్పటికే విపక్షాలు ప్రతి విషయాన్నీ రాజకీయంగా వాడుకుంటున్నాయి. ఈ తరుణంలో సునీత కోర్టులో వినిపించిన వాదనను సహజంగానే విపక్షాలు రాజకీయం చేస్తాయి.
ఇదిలావుంటే, ప్రభుత్వానికి తెలియకుండా అది కూడా తన సొంత అన్నే సీఎంగా ఉన్న రాష్ట్రంలో ప్రభుత్వానికి చెప్పకుండానే సునీత ఇలా హైకోర్టుకు ఎక్కారా? అనేది మరో కీలక ప్రశ్న. ఒకపక్క, సిట్ విచారణ సాగిస్తోందని చెబుతున్నారు. అయితే, ఇప్పటి వరకు దీనికి కారకులు ఎవరు? ఎందుకు చేశారనే విషయాల్లో ఆవగింజంత వాస్తవం కూడా బయటకు రాలేదు. ఈ పరిణామాలు గమనిస్తే.. జగన్ ప్రభుత్వంపై విపక్షాలు మరింతగా దాడిచేసే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.