విజృంభించిన సన్‌రైజర్స్‌.. కోల్‌కతా లక్ష్యం 229

-

ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరుగుతోన్న ఐపీఎల్ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టు భారీ స్కోర్ చేసింది. ఓపెన‌ర్ హ్యారీ బ్రూక్(100) సెంచ‌రీ బాద‌డంతో హైద‌రాబాద్ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్‌రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఓపెనర్ హ్యారీ బ్రూక్ సూపర్ సెంచరీతో చెలరేగడంతో సన్‌రైజర్స్ జట్టుకు భారీ స్కోర్ దక్కిందనే చెప్పాలి.

 

హ్యారీ తన ఇన్నింగ్ లో 55 బంతులను ఎదురుకుని 100 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 3 సిక్సులున్నాయి. ముందునుంచి మంచి దూకుడుగా ఆడిన హ్యారీ కోల్‌కతా బౌలర్లలపై ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు.హ్యారీకి ఇదే ఐపీఎల్ లో తొలి సెంచరీ కావడం విశేషం. ఇక మరో ఆటగాడు మార్‌క్రమ్‌ (50) హాఫ్ సెంచరీతో ఆదరగొట్టగా, చివర్లో అభిషేక్ శర్మ (32) దూకుడుగా ఆడటంతో సన్‌రైజర్స్ భారీ స్కోర్ చేసింది. కోల్‌కతా బౌలర్లలో రస్సెల్ 3, వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ తీశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version