బాలయ్య బాబు కోసం దిమ్మ తిరిగే స్క్రిప్ట్ సిద్ధం..!!

-

నందమూరి బాలకృష్ణ  ప్రస్తుతం తాను గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సినిమా వీరసింహారెడ్డి లో నటిస్తున్నారు.ఇక  తర్వాత సినిమా అనిల్ రావిపూడి తో చేస్తున్న సంగతి తెలిసిందే. దాని కోసం అనిల్ రావిపూడి ఎంతో కష్టపడి స్క్రిప్ట్ రెడీ చేసారట. దీనిలో కూడా బాలయ్య కు తగ్గట్టుగా గా ఉండేలా యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్స్ ఉండనున్నాయట. దీనికి బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా ఐ డోంట్ కేర్ బ్రో అనే టైటిల్ పెడుతున్నారని తెలుస్తొంది.

అయితే బాలయ్య బాబు మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ డైరెక్టర్ మరెవరో కాదు సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సర్కారు వారి పాట సినిమా తీసి సూపర్ హిట్ కొట్టిన పరశురామ్. ఈ సినిమా లైన్ చెప్పి సినిమా ఓకే చేయించుకున్న పరశురామ్ బాలయ్య బాబు కోసం దిమ్మతిరిగి పోయే సబ్జెక్ట్ రెడీ చేస్తున్నాడట. సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

వారు చెబుతున్న ప్రకారం ఈ సినిమాలో బాలయ్య ముఖ్య మంత్రి పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది. బాలయ్య క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. ఇందులో నీతి నిజాయితీ గల ముఖ్య మంత్రి పాత్ర గా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా కూడా వచ్చే ఎన్నికల లోపు విడుదల చేయాలని చూస్తున్నారట. అలా ఇప్పుడు అధికారం లో ఉన్న పార్టీకి జులక్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version