వయోపరిమితిని పెంచండి.. ఏపీ పోలీస్ నియామకాల బోర్డు చైర్ పర్సన్‌కు లోకేశ్‌ లేఖ

-

ఇటీవల పోలీస్‌ శాఖలో ఉన్న ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఎట్టకేలకు వైసీపీ సర్కారు పోలీస్ ఉద్యోగాలకు జారీ చేసిన నోటిఫికేషన్ వయోపరిమితి నిబంధనతో చాలా మందికి అందని ద్రాక్షలా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. పోలీసు ఉద్యోగాల భర్తీకి గరిష్ఠ వయోపరిమితి ఐదేళ్లు సడలించాలని, తద్వారా మరింతమంది నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ పోలీస్ నియామకాల బోర్డు చైర్ పర్సన్ కు లేఖ రాశారు నారా లోకేశ్.

టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018లో పోలీసు ఉద్యోగాల భర్తీకి చివరి నోటిఫికేషన్ విడుదలైందని తెలిపారు. ప్రతి ఏటా పోలీసు శాఖలో ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టిన వైసీపీ సర్కారు, మూడున్నరేళ్ల తర్వాత పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిందని నారా లోకేశ్ ఆరోపించారు. నాలుగేళ్ల విరామం తర్వాత పోలీసు శాఖలో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ వెలువడడంతో ఉద్యోగార్థులు సంతోషపడ్డారని, అయితే వారి ఆనందం గరిష్ఠ వయో పరిమితి నిబంధనతో ఆవిరైందని లోకేశ్ తెలిపారు నారా లోకేశ్. “యువత ఏళ్ల తరబడి పోలీసు ఉద్యోగం కోసం శిక్షణ తీసుకుంటున్నారు. వారికి ఈ నోటిఫికేషన్ వేదన కలిగిస్తోంది. వయోపరిమితి నిబంధన వలన ఎంతోమంది అనర్హులుగా మారిపోయారు. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్లలో ఉద్యోగాల భర్తీకి ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో చాలా మంది అభ్యర్థులు వయస్సు దాటిపోయి అనర్హులుగా మారారు. మన పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రం పోలీస్ శాఖ ఉద్యోగాలకు 5 సంవత్సరాల గరిష్ఠ వయో పరిమితి సడలింపును ఇచ్చిన విషయం పరిగణనలోకి తీసుకుని ఏపీలో కూడా వయోపరిమితి సడలింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను.

Read more RELATED
Recommended to you

Exit mobile version