ఈ ఏడాది నుంచి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈనెల 28న అసెంబ్లీ లో ప్రవేశ పెట్టే బడ్జెట్ ప్రతిపాదనలు, బడ్జెట్ కూర్పు పై మంత్రి పయ్యావుల కేశవ్, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తల్లికి వందనం, అన్నదాత, ఉచిత బస్సు వంటి పథకాలకు ఈ ఏడాది నుంచి శ్రీకారం చుట్టున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ కూర్పు సవాల్ గా మారింది.
అటు పథకాలు, ఇటు అభివృద్ధి కార్యక్రమాలను బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే.. పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టులకు కేంద్ర సాయంతో కొంత ఊరట లభించినట్లైంది. అయితే.. రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల నేపథ్యంలో ప్రత్యేక సాయం అదించాలని సీఎం చంద్రబాబు 16వ అర్థిక సంఘాన్ని కోరారు. సంక్షేమం ఇస్తూ, అభివృద్ధి పనులను కొనసాగిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో.. బడ్జెట్ కూర్పుపై విస్తృత కసరత్తు చేస్తుంది ఏపీ సర్కార్.