యావత్ ప్రపంచం కరోనా వైరస్ దెబ్బకి విల విల లాడి పోతుంది. మందులేని ఈ కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు వేలల్లో మరణిస్తుంటే, లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో అంతర్జాతీయ స్థాయిలో ఉన్న శాస్త్రవేత్తలు ఈ వైరస్ కి వ్యాక్సిన్ కనిపెట్టడానికి రాత్రింబవళ్ళు తెగ కష్టపడుతున్నారు. చాలా దేశాలలో పెద్ద ఎత్తున ఈ మహమ్మారి వైరస్ విరుగుడు కోసం పెద్ద ఎత్తున ప్రయోగాలు జరుగుతున్నాయి. కొన్ని దేశాలలో ఇప్పటికే వ్యాక్సిన్ రెడీ అయినట్లు వార్తలు వస్తున్నా వాటిలో ఎంత వాస్తవం ఉందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఇటువంటి టైంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కి చెందిన రిలయన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ శాస్త్రవేత్తలు ఓ కీలక విషయాన్ని కనిపెట్టారు.
ఎరుపు రంగు లో లభించే ఈ నాచు తో కరోనా యాంటీ వైరల్ మందులే కాకుండా శానిటరైజ్ వస్తువులపై కూడా వైరస్ చేరకుండా కోటింగ్ వేయవచ్చని తమ రీసెర్చ్ ద్వారా శాస్త్రవేత్తలు తెలియజేశారు. ముందుగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ పై పరీక్షలు చేసిన తర్వాత సూపర్ సక్సెస్ అయితే మార్కెట్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. మరోపక్క ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్, చైనా దేశాలు కూడా సెప్టెంబర్ నెల లోపు వ్యాక్సిన్ రెడీ అవుతున్నట్లు ప్రకటించాయి. తాజాగా ఈ జాబితాలో భారత్ కూడా చేరటంతో కరోనా వైరస్ వ్యాక్సిన్ విషయంలో ప్రపంచ మానవాళికి ఆశలు చిగురిస్తున్నాయి.