సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి మొట్టికాయలు వేశారు. అసెంబ్లీలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత పడదని, ఉపఎన్నికలు రావని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను సుప్రీంకోర్టు జడ్జి దృష్టికి న్యాయవాది సుందరం తీసుకెళ్లినట్లు సమాచారం.
కోర్టులో నడుస్తున్న కేసును రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎలా మాట్లాడుతాడు? ఉప ఎన్నికలు రావని రేవంత్ రెడ్డి ఎలా అంటాడు? ఇంతకూ ముందే ఇలా న్యాయస్థానానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి మాట్లాడాడు. మళ్లీ మళ్లీ అలానే రిపీట్ చేస్తున్నాడు అంటూ రేవంత్ రెడ్డిపై జస్టిస్ బీఆర్ గవాయ్ సీరియస్ అయ్యారు. సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.