రాహుల్​కు సూరత్ కోర్టు షాక్.. పరువునష్టం కేసులో స్టే పిటిషన్ కొట్టివేత

-

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీకి గుజరాత్‌లోని సూరత్‌ కోర్టులో చుక్కెదురైంది. తనకు పడిన శిక్షపై స్టే విధించాలని చేసిన అభ్యర్థనను కోర్టు కొట్టివేసింది. దీంతో రాహుల్‌ గాంధీపై శిక్ష కొనసాగనుంది. రాహుల్​ దాఖలు చేసిన పిటిషన్​పై సూరత్ సెషన్స్ కోర్టు.. ఏప్రిల్​ 13న ఇరువర్గాల వాదనలు విన్నది.

ఆ సమయంలో రాహుల్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వొకేట్ ఆర్ఎస్ చీమా.. మోదీ అనేది కులం పేరు కాదని అన్నారు. రాహుల్​కు శిక్ష విధించిన న్యాయమూర్తిని ఎవరో తప్పుదోవ పట్టించారని తెలిపారు. న్యాయమూర్తి కఠిన పదాలు ఉపయోగించడం సరికాదని వాదించారు.

“రాహుల్​కు విధించిన శిక్షలో ఒక్కరోజు తగ్గినా.. అనర్హత వేటు పడదని కోర్టుకు తెలుసు. ఆయన్ను దోషిగా తేల్చి అరగంట వ్యవధిలో అత్యంత కఠినమైన శిక్ష విధించారు. సుప్రీంకోర్టు రాహుల్​ను హెచ్చరించిందని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. సుప్రీం హెచ్చరికలను సైతం పట్టించుకోలేదని కఠిన వ్యాఖ్యలు చేసింది. కానీ, ఆయన ప్రసంగం.. సుప్రీం హెచ్చరికల కన్నా ముందే జరిగింది” అని రాహుల్​ తరఫు న్యాయవాది తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version