ఇంత వేడిని తట్టుకోవాలంటే… వేసవిలో కచ్చితంగా వీటిని తీసుకోవాల్సిందే..!

-

వేసవి కాలంలో ఎండ ఎక్కువగా ఉంటుంది దాంతో చాలా మంది రకరకాల బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వేసవికాలంలో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా ఖచ్చితంగా వీటిని పాటించాల్సిందే. వేసవికాలంలో చాలా మంది ఎండలు ఎక్కువగా ఉండడంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకోసం ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధని పెట్టాలి. నీళ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి దానితో పాటుగా నీళ్లు ఎక్కువగా ఉండే కూరగాయలను కూడా తీసుకుంటూ ఉండాలి ఇలా చేయడం వలన విటమిన్స్ మినరల్స్ తో పాటు నీళ్లు కూడా అందుతాయి.

 

సీజనల్ ఫ్రూట్స్, కూరగాయలలో నీళ్లు ఎక్కువగా ఉంటుంటాయి. పెరుగుని కూడా తీసుకుంటూ ఉండండి. పెరుగు జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. ప్రోబయోటిక్స్ కూడా ఉంటాయి. లేత కొబ్బరి నీళ్ళని కూడా సమ్మర్ లో తీసుకుంటూ ఉండాలి. కొబ్బరినీళ్ళని తీసుకుంటే విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది కూడా. స్వీట్ కార్న్ కూడా తీసుకోవచ్చు ఫైబర్ ఇందులో ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటుగా విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. చర్మానికి జుట్టుకి కళ్ళకి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది.

వేసవికాలం లో బటర్ మిల్క్ ని కూడా తీసుకుంటూ ఉండండి. ఇది మిమ్మల్ని చల్లగా ఉంచుతుంది హైడ్రాయిడ్ గా ఉంచుతుంది. పుచ్చకాయ కీరదోస నేరేడు పండ్లు నిమ్మరసం వంటివి కూడా వేసవిలో ఎక్కువగా తీసుకుంటూ ఉండండి వేసవిలో వ్యాయామం చేయాలనుకునే వాళ్ళు స్విమ్మింగ్ చేయడం మంచిది. అలానే సైక్లింగ్ వంటివి చేయండి. ఎండలో వాకింగ్ చేయడం వంటివి మానుకోండి ఎండలో వాకింగ్ కి వెళ్లడం లేదంటే ఎక్కువ వ్యాయామం వంటివి చేస్తే ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి వేసవిలో జాగ్రత్తగా వుండండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version