చిరిగిన చొక్కా తో సురేఖ మెడలో తాళి కట్టిన చిరు.. కారణం.?

-

సినీ ఇండస్ట్రీలోకి ఎవరి సహాయ సహకారాలు లేకుండా అడుగుపెట్టిన ఈయన తన తెలివితో, ప్రతిభతో, అనుకువతో అతి తక్కువ సమయంలోనే సుప్రీం హీరో అయ్యారు. చిన్న చిన్న పాత్రలు వేస్తూ తన కెరీర్ ను కొనసాగించిన చిరంజీవి నలుగురిలో ఒకరిగా చేస్తూ.. ఉన్నదాంట్లోనే ఒక ప్రత్యేకతను సృష్టించుకునేవారు. ప్రత్యేకంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసేవారు. ముఖ్యంగా మన ఊరి పాండవులు సినిమా చూసిన వారందరికీ కూడా ఖచ్చితంగా ఈ విషయం స్పష్టమవుతుంది. ఈ సినిమాలో అల్లు రామలింగయ్య కూడా కీలక పాత్ర పోషించగా.. చిరంజీవిని దగ్గరుండి మరి అబ్జర్వ్ చేసే అవకాశం లభించింది. ఇక ఆ సమయంలోనే చిరంజీవిలో ఏదో మెరుపు ఉందని గమనించిన అల్లు రామలింగయ్య ఎప్పటికైనా పైకొస్తావని ఆయనతో చెప్పారట.

ఇకపోతే తన కూతురు సురేఖను ఇచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన అల్లు రామలింగయ్యకు కలిగింది. ఇక ఈ విషయాన్ని అల్లు అరవింద్ దగ్గర ప్రస్తావించి చిరంజీవితో మాట్లాడమని చెప్పారట అల్లు రామలింగయ్య. ఇక అలా పున్నమినాగు సినిమా ప్రివ్యూ థియేటర్లో వేసినప్పుడు చిరంజీవిని అల్లు అరవింద్ కలుసుకొని తన మనసులో మాటను చిరంజీవికి చెప్పి ఆయన ఒప్పించడం జరిగింది. ఇక చిరంజీవిని చూసిన సురేఖ ఆయన అంత స్టైల్గా లేడని తండ్రితో చెప్పడంతో కానీ కుర్రాడు బుద్ధిమంతుడని, పైకి వచ్చే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పి మరి పెళ్లికి ఒప్పించారట..

ఇక అలా ఎట్టకేలకు 1980 ఫిబ్రవరి 20వ తేదీన వీరి పెళ్లి జరిపించాలని పెద్దలు నిర్ణయించారు. ఇకపోతే అదే సమయానికి తాతయ్య ప్రేమ లీలలు సినిమా షూటింగ్లో చిరంజీవి చాలా బిజీగా ఉన్నారు. ఇక నూతన ప్రసాద్ డేట్స్ లేకపోవడం వల్ల షూటింగ్ క్యాన్సిల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇక అందువల్ల లొకేషన్ కి దగ్గర్లోనే అరవింద్ పెళ్లి మండపాన్ని ఏర్పాటు చేశారట. సినిమాలో కొన్ని సన్నివేశాలు చేస్తున్నప్పుడు చిరంజీవి చొక్కా చిరిగిందట. కానీ ముహూర్త సమయం దగ్గర పడడంతో అదే చొక్కాతో పెళ్లి పీటలపై కూర్చొని.. సురేఖ మెడలో తాళి కట్టారట . ఇక మోచేతి దగ్గర చిరిగి ఉందని అక్కడివారు అంటే తాళి కట్టడానికి ఇదేం అడ్డు కాదే అంటూ తన సింప్లిసిటీ చూపించారట చిరంజీవి. ఇక చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఎదిగిన ఈయన ఆ తర్వాత మెగాస్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version