విద్యా శాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి – బాసర ఘటనపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీరియస్

-

నిజామాబాద్ ఆస్పత్రి లో బాసర ఐఐఐటి విధ్యార్ధులను పరామర్శించారు బీఎస్పీ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్. ఈ సందర్భంగా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. నిన్న రాత్రి పుడ్ పాయిజన్ జరిగిందని.. కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా యూనివర్సిటీలను నిర్వీర్య చేస్తుందని ఫైర్ అయ్యారు.

గతం లో కూడా ముఖ్యమంత్రి కి లేఖ రాసాం.. పట్టించుకోవడం లేదు.. కప్పలు వచ్చినా పట్టించుకోలేడని అగ్రహించారు. విద్యార్థుల డిమాండ్లను అప్పుడు సిల్లీ డిమాండ్స్ అన్నారు.. ఇప్పుడు అర్థమైందా ? అని నిలదీశారు. ముఖ్య మంత్రి రావాలి అన్న కూడా రాలేదు.. వైస్ ఛాన్స్ లర్ లేరు.. కామన్ మెస్ ఉంది.. అక్కడ అనేక ఇబ్బందులు ఉన్నాయని నిప్పులు చెరిగారు.

విద్యా శాఖ మంత్రి ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు బీఎస్పీ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్. మెస్ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు కెసిఅర్ తో ములాఖత్ అయ్యారు.. ప్రతిపక్షాలు లేవు, ప్రతిపక్షాలు ఉంటె ఈ పరిస్థితి ఉండదని పేర్కొన్నారు బీఎస్పీ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్.

Read more RELATED
Recommended to you

Exit mobile version