Suriya ET movie: ‘ఈటీ’ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే ?

-

లాక్‌డౌన్ స‌మ‌యంలో ఆకాశం నీ హ‌ద్దురా, జై భీమ్ వంటి అద్భుత‌మైన చిత్రాల్లో ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేసిన కోలివుడ్ స్టార్ సూర్య…ఇప్పుడు కొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు వచ్చాడు. స‌న్ పిక్ష‌ర్స్ ప‌తాకంపై క‌ళానిధి మార‌న్ నిర్మాత‌గా పాండిరాజ్ ద‌ర్శ‌కత్వంలో వ‌స్తున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చిత్రం ఈటీ {ఎవరికీ తలవంచడు}. సూర్య‌కు ఉన్న భారీ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని తెలుగులో ఈటీ పేరుతో విడుద‌ల చేసింది. ఈ చిత్రం హ‌క్కుల‌ను ఫ్యాన్సీ ధ‌ర‌కు ఏషియ‌న్‌సంస్థ సొంతం చేసుకుంది.

చిత్రం : ఈటీ
నిర్మాణ సంస్థ
: సన్‌ పిక్చర్స్
నటీనటులు: సూర్య, ప్రియాంక అరుళ్‌ మోహన్‌, వినయ్‌ రాయ్‌, సత్యరాజ్‌, శరణ్య, జయప్రకాష్‌, దేవదర్శిని, సూరి తదితరులు
నిర్మాత: కళానిధి మారన్‌
రచన – దర్శకత్వం: పాండిరాజ్‌
సినిమాటోగ్రఫీ: ఆర్‌.రత్నవేలు
ఎడిటింగ్‌: రూబెన్‌
సంగీతం: డి.ఇమాన్‌
విడుదల: మార్చి 10, 2022

ఆర్‌.ర‌త్న‌వేలు సినిమాటోగ్రాఫ‌ర్, డి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సూర్య స‌ర‌స‌న ప్రియాంక అరుల్ మోహ‌న్ న‌టించింది. అయితే..త‌మిళ వెర్ష‌న్‌తో పాటు తెలుగులో కూడా ఈ చిత్రం ఇవాళ ఒకేసారి విడుద‌ల అయింది. అయితే.. ఈ సినిమాపై చాలా పాజిటివ్‌ గా రెస్పాన్స్‌ వస్తోంది. ఈ సినిమా చూసిన ప్యాన్స్‌ మూవీ చాలా బాగుందని చెబుతున్నారు. మహిళలకు ఎలా భరోసా, భద్రతను కల్పించాలో ఈ సినిమా ద్వారా దర్శకుడు అద్భుతంగా చూపించారని చెబుతున్నారు.

స్త్రీల సమస్యలపై పోరాడే పాత్రలో కన్నభిరన్‌ గా సూర్య నటన కేక పుట్టిస్తొందని అంటున్నారు. ఫస్టాప్‌ మాస్‌ జాతర, సెకండాఫ్‌ డీసెంట్‌ గా సాగుతోందని.. మొత్తంగా సినిమా కచ్చితంగా బ్లాక్‌ బస్టర్‌ అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్వెల్‌ సీన్‌ పూనకాలు తెప్పిస్తుందట. థియేటర్ల ముందు బాణాసంచా కాలుస్తూ ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకుంటున్నారు. కోటు వేసుకునే జడ్జి వేరే.. పంచె ఎగ్గడితే నేనేరా జడ్జిని… అమ్మాయిలు అంటే బహీనులు అనుకుంటారు. బలవంతులు అని నిరూపించాలి.. అనేటు వంటి డైలాగులు అదిరిపోయాయయిన వారు చెబుతున్నారు.

ఈటీ మూవీ రివ్యూ రేటింగ్‌ 3/5

Read more RELATED
Recommended to you

Exit mobile version