రాజన్ పిళ్ళై బయోపిక్ లో సూర్య..!

-

కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య, మల్లు సూపర్ స్టార్ పృథ్వీరాజ్ ఇద్దరూ దక్షిణాదిన మంచి పేరు సంపాదించి అగ్ర హీరోలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ కథను మాత్రమే నమ్మి సినిమా తీస్తారు అనే పేరు గట్టిగా ఉంది. అయితే తాజాగా వీరికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది

సూర్య.. పృథ్వీరాజ్ దర్శకత్వంలో ఒక బయోపిక్ లో నటించబోతున్నాడనే వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. ఒక పక్క హీరోగా నటిస్తూనే మరోపక్క దర్శకుడుగా తన ప్రతిభను చాటుతున్నాడు పృథ్వీరాజ్. మొదటి మూవీతోనే కేరళ ఇండస్ట్రీ లో హిట్ ని అందుకున్నాడు. ఇప్పుడు ఆయన బ్రిటానియా బిస్కెట్స్ ఇండస్ట్రీకి చెందినటు వంటి రాజన్ పిళ్ళై బయోపిక్ తీయబోతున్నాడు అని తెలుస్తుంది. తాజాగా సూర్య పృధ్విరాజ్ ను కలవడంతో ఈ సినిమాలో సూర్య హీరోగా నటించబోతున్నాడు అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి అలాగే ఈ సినిమాకు సహనిర్మాతగా కూడా వ్యవహరించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాని సరిగమ ఇండియన్ నిర్మాణ సంస్థ నిర్మించబోతుందని తెలుస్తుంది.

కాగా రాజన్‌ పిళ్లై ఒక వ్యాపారవేత్త. బ్రిటానియా ఇండస్ట్రీలో వాటాదారు. 1970లో సింగపూర్ కేంద్రంగా తన వ్యాపారాన్ని కొనసాగించి బిస్కెట్‌ కింగ్‌గా ఎదిగారు. 1993లో సింగపూర్ వాణిజ్య వ్యవహారాల శాఖ అతనిపై విచారణ చేపట్టింది. సింగపూర్‌ ప్రభుత్వ సమాచారం మేరకు భారత పోలీసులు 1995 జూలై 4న కొత్త ఢిల్లీలోని ఓ హోటల్‌లో అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను తీహార్‌ జైలుకు పంపించారు. కాగా అనారోగ్యంతో రాజన్ పిళ్లై కస్టడీలోనే మరణించడం అప్పట్లో సంచలనమైంది. కె. గోవిందన్‌ కుట్టితో కలిసి రాజన్ సోదరుడు రామ్మోహన్‌ పిళ్లై ‘ఏ వేస్టెడ్‌ డెత్‌: ది రైజ్‌ అండ్‌ ఫాల్ ఆఫ్‌ రాజన్‌ పిళ్లై’ పేరుతో పుస్తకం కూడా రాశారు.. ప్రస్తుతం ఈ పుస్తకం ఆధారంగానే ఈ సినిమా రానున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version