ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రజల సంక్షేమం కోసం పథకాలను ప్రవేశపెడుతుందో ఓ సర్పంచ్ కూడా తన గ్రామ పంచాయితీలో అలాంటి ఓ పథకాన్ని ప్రారంభించాడు. వివరాల్లోకి వెళితే …కరీంనగర్ జిల్లా నుస్తులాపూర్ గ్రామ సర్పంచ్ రావుల రమేష్ ఆయన పేరుతో “రమేష్ అన్న కానుక” అనే కార్యక్రమాన్ని గ్రామం లో ప్రారంభించబోతునట్టు ప్రకటించాడు. దసరా నుండి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది అని …ఈ కార్యక్రమం కింద గ్రామం లో ఎవరికైనా ఆడ శిశువు జన్మిస్తే ఆ బిడ్డ కౌంట్ లో తాను రూ. 5,116 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని వెల్లడించాడు.
ఆడపిల్లలపై వివక్ష పూర్తిగా తొలగిపోవాలి అనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు రమేష్ వెల్లడించారు. ఇక రమేష్ తీసుకున్న నిర్ణయానికి సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. గ్రామస్థులు తమ సర్పంచ్ నిర్ణయం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న రమేష్ అన్నను మిగితా గ్రామాల సర్పంచ్ లు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిందే.