ఈజిప్టులో బయటపడ్డ ప్రాచీన సూర్య దేవాలయం..

-

అంతుచిక్కని రహస్యాలు దాగి ఉన్న ఈజిప్టులో ఎప్పుడూ ఏదో ఒక ఊహించని విధంగా వస్తువులు లభ్యమవుతుంటాయి. పిరమిడ్ లకు ప్రసిద్ధిగాంచిన ఈజిప్టు దేశంలో అత్యంత ప్రాచీన సూర్యదేవాలయం బయటపడింది. ఇక్కడి అబూసిర్ ప్రాంతంలో ఇటలీ, పోలెండ్ పురావస్తు శాస్త్రజ్ఞులు చేపట్టిన తవ్వకాల్లో సూర్యదేవాలయ నిర్మాణాలు లభ్యమైనట్లు పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. ఈ సూర్యదేవాలయం 4,500 ఏళ్ల నాటిదని భావిస్తున్నారు అధికారులు. క్రీస్తు పూర్వం 2465-2323 కాలం నాటిదని అంచనా. ఫారో చక్రవర్తులు పాలించిన గడ్డపైనా సూర్యోపాసన సాగిందనడానికి ఈ ఆలయమే నిదర్శనం.

ఈ ఆలయాన్ని నుసెర్రే అనే రాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. కాగా, ఈ తవ్వకాల్లో ఆలయ నిర్మాణాలే కాదు, పలు పాత్రలు, గ్లాసులు తదితర వస్తువులు కూడా బయల్పడ్డాయి. దీనికి సంబంధించి ఈజిప్టు కళాఖండాలు, పర్యాటక మంత్రిత్వ శాఖ జులై 31న ప్రకటన చేసింది. ప్రాచీన ఈజిప్టు ప్రజలు సూర్య దేవత అయిన ‘రా’ను పూజించేవారు. సూర్యుడు శక్తిప్రదాత అని అక్కడి ప్రజల నమ్మకం. డేగ తలతో ఉన్న సూర్యదేవత రా చిత్రాలు గతంలో వెలుగుచూశాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version