సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య వ్యవహారం ఇప్పుడు బీహార్ వర్సెస్ మహారాష్ట్రగా మారిపోయింది. రెండు రాష్ట్రాల మధ్య ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ హాట్ గా నడుస్తుంది. ఈ కేసుని విచారించడానికి గానూ బీహార్ నుంచి ముంబై వెళ్ళిన ఐపిఎస్ ఆఫీస్ వినయ్ తివారీ ని ముంబై మున్సిపల్ అధికారులు బలవంతంగా క్వారంటైన్ చేయడం సంచలనంగా మారింది. ఇది రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ దుమారం రేపింది.
ఈ నేపధ్యంలో వినయ్ ని ముంబై మున్సిపల్ అధికారులు విడిచిపెట్టారు. ముంబైలో నిర్బంధంలో ఉన్న బీహార్ ఐపిఎస్ అధికారి వినయ్ తివారీ ఈ రోజు పాట్నాకు బయలుదేరారని అక్కడి అధికారులు పేర్కొన్నారు. మరో నలుగురు అధికారులు నిన్న పాట్నాకు తిరిగి వచ్చారని పేర్కొన్నారు. తాను క్వారంటైన్ నుంచి వెళ్ళవచ్చు అని ముంబై మున్సిపల్ శాఖ తనకు మెసేజ్ చేసింది అని తాను ఇప్పుడు పాట్నా వెళ్తున్నా అని ఆయన పేర్కొన్నారు.