బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, హీరోయిన్ సారా అలీఖాన్ మధ్య ప్రేమాయణం నడిచినట్లు ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. ఈ నటుడి స్నేహితుడు శామ్యూల్ మిరండా ఈ విషయాన్ని ఇటీవల చెప్పగా బీటౌన్‌లో అలజడి రేగింది. తాజాగా ఈ విషయమై మాట్లాడాడు సుశాంత్ మాజీ అసిస్టెంట్ సాబిర్ అహ్మద్.గతంలో వీరిద్దరితో కలిసి ఓ ప్రైవేట్ జెట్‌లో థాయ్‌లాండ్ ట్రిప్‌కు వెళ్లానని చెప్పాడు సాబిర్. మొత్తంగా ఆరుగురం కలిసి వెళ్లినట్లు తెలిపాడు. కాగా సుశాంత్, సారా బ్యాంకాక్‌లోని ఓ విలాసవంతమైన హోటల్లో బసచేసినట్లు వెల్లడించాడు. సందర్శనలో భాగంగా మిగితా వారు అక్కడే వేరే ప్రాంతాలను చూడటానికి వెళ్తే.. వీరు మాత్రం హోటల్లోనే గడిపినట్లు పేర్కొన్నాడు. ఈ ట్రిప్ కోసం సుశాంత్ రూ.70లక్షల రూపాయలు ఖర్చు చేశాడని చెప్పాడు.
సుశాంత్ డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం లేదని చెప్పాడు సాబిర్. అతనెప్పుడు అందరితో సంతోషంగా గడిపేవాడని చెప్పుకొచ్చాడు. ఇటీవల ఈ హీరో ఓ డ్రగ్ స్మగ్లర్ వద్ద మాదక ద్రవ్యాలు విక్రయించినట్లు వస్తోన్న వార్తలను ఖండించాడు. తాను రాజ్‌పుత్ దగ్గర పని చేసినపుడు అతడు డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టం చేశాడు.సుశాంత్-సారా ‘కేదార్నాథ్’ సినిమాలో కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ వ్యవహారం గురించి నడిచిందని వార్తలు వచ్చాయి. కానీ, దీనిపై వారిద్దరిలో ఎవరూ స్పందించలేదు.