సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ చివరి సినిమా..! ”దిల్ బెచార” టీజర్ విడుదల…!

-

గత నెల బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన చివరిసారిగా నటించిన సినిమా ‘’దిల్ బెచారా’’ షూటింగ్ పూర్తి అయినప్పటికీ లాక్ డౌన్ అమలులో ఉండటంతో విడుదల అవ్వలేదు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మిత్రుడు ముఖేష్‌ చబ్రా ఈ సినిమాని డైరెక్ట్  చేశాడు. కాగా నేడు ఈ సినిమా టీజర్ నేడు విడుదల అయ్యింది. ట్రైలర్ లో చూస్తుంటే ఈ సినిమాలో మనసుకు నచ్చే అంశాలు పుష్కలంగా ఉండబోతున్నాయి అని అనిపిస్తుంది. ఇద్దరి ప్రేమికుల కథ, ఆమెకు క్యాన్సర్ ఉంటుంది ఈయన ఆమెకు క్యాన్సర్ ఉందని తెలిసినా ప్రేమిస్తాడు. చివరికి ఏం జరుగుతుందో చూడాలి అంటే సినిమా చూడాల్సిందే.

sushanth singh rajput last film dil bechara to be realesd on hotstar soon
sushanth singh rajput last film dil bechara to be realesd on hotstar soon

కాగా ఈ సినిమా జాన్ గ్రీన్ రాసిన ‘ది ఫాల్ట్‌ ఇన్‌ అవర్‌ స్టార్స్‌’ నవల ఆధారంగా చిత్రీకరించారు. సినిమాను సుశాంత్ సన్నిహితుడు ముకేష్ చబ్రా డైరెక్ట్ చేయగా కథానాయికగా సంజన సంఘీ నటించింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటించాడు సినిమాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. ఈ సినిమా రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ దక్కించుకుంది కాగా సినిమాను ఈ నెల 24 న ఓ‌టి‌టి లో రిలీజ్ చేస్తునట్టుగా వాళ్ళు వెల్లడించారు. సినిమాను సుశాంత్ సింగ్ కు ట్రిబ్యూట్ గా ప్రతీ ఒక్కరికీ ఫ్రీ గా చూసే అవకాశాన్ని కల్పిస్తున్నట్టుగా సంస్థ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version