బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పై ఇటీవలి ఓ గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన విషయం తెలిసిందే.ఎవరూ చూడకముందే అతని ఇంట్లోకి చొరబడిన నిందితుడు సైఫ్ ఒంటి మీద కత్తి గాట్లు పెట్టినట్లు సమాచారం. సుమారు 6 నుంచి 7 కత్తి పోట్లు పడినట్లు వైద్యులు నిర్దారించారు. ప్రస్తుతం ఆయన ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటన జరిగి మూడు రోజులు గడుస్తుండగా, తాజాగా ఈకేసులో కీలక సూత్రధారి అయిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని ఆకాశ్ కనోజియాగా గుర్తించారు.అతన్ని ఛత్తీస్‌గఢ్ దుర్గ్‌లోని జ్ఞానేశ్వర్ ఎక్స్‌ప్రెస్‌లో రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి కోసం ముంబై నుంచి పోలీసులు ఛత్తీస్‌గఢ్ బయల్దేరి వెళ్లారు. కాగా, సైఫ్ అలీఖాన్ మీద దాడితో సౌత్ ఇండస్ట్రీలో పెద్దలు ఆయనకు మద్దతుగా నిలిచారు.