అమరావతి: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు కు మరోసారి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎస్ సమీర్ శర్మ. గత ఏడాది మార్చి నెలలో ఏబీ వెంకటేశ్వరరావుపై క్రిమినల్ కేసు నమోదు అయింది.
టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్ ఏడీజీపీగా ఉన్న సమయంలో నిఘా పరికరాల కొనుగోళ్ళ అంశం పై ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు. ఆల్ ఇండియా సర్వీసెస్ నిబంధనలు 1969 ప్రకారం క్రిమినల్ కేసులు ఉన్న వారిని సస్పెండ్ చేసే విచక్షణాధికారం రాష్ట్రానికి ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎస్ సమీర్ శర్మ.
దీంతో ఏబి వెంకటేశ్వరరావు కు షాక్ తగిలింది. ఇది ఇలా ఉండగా ఇటీవలే ఆయన… ఏపీ ప్రభుత్వంలో తన పదవి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన డ్యూటీ బాధ్యతలు తీసుకొని 15 రోజులు గడవక ముందే సస్పెన్షన్ వేటు పడింది. కాగా ఏపీ ప్రభుత్వం మరియు వెంకటేశ్వరరావు మధ్య వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే.