తిరుపతిలో బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ అనుమానాస్పద మృతి

-

ఏపీలోని తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల కథనం ప్రకారం..తిరుపతి రూరల్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో వెంకటప్రసాద్ అనే వ్యక్తి అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. శ్రీపురం కాలనీలో నివాసముండే అతను..2012లో తిరుపతికి చెందిన మాధురిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు.

ఈ క్రమంలోనే సోమవారం(అక్టోబర్ 28) నుంచి వెంకటప్రసాద్ అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. దీంతో ఫ్యామిలీ మెంబర్స్ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు.విచారణలో భాగంగా పోలీసులకు షాకింగ్ న్యూస్ తెలిసింది. వెంకటప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు.తనపల్లి దగ్గర ఓ ప్రైవేట్ లాడ్జిలో ఉరివేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. అయితే, అతని ఒంటిపై రక్తపు మరకలున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.లవ్ మ్యారెజ్ చేసుకున్న క్రమంలో ఎవరైనా మర్డర్ చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా? అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version