బ్రేకింగ్ : మరికాసేపట్లో బీజేపీలోకి స్వామీ గౌడ్

-

సహచరులతో కలిసి శాసనమండలి మాజీ  చైర్మన్ స్వామి గౌడ్ ఢిల్లీ కి వెళ్లారు. ఆయన ఈ రోజు ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో పార్టీలో చేరే అవకాశం ఉంది. మండలి చైర్మన్ గా పనిచేసిన ఆయనకు ఆ పదవీ కాలం ముగిశాక టీఆర్ఎస్ ఆయనను పక్కన పెట్టింది. అంతకు ముందు టీఎన్జీవో అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన తెలంగాణా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ ఉద్యోగుల కూడగట్టిన ఆయన టీఆర్ఎస్ కు కూడా అండగా నిలబడ్డారు.

swami goud

తెలంగాణా ఉద్యమంలో పాల్గొన్న ఆయన శాసన మండలి చైర్మన్ గా నియమితులు అయ్యారు. అయితే ఆయన పదవీకాలం పూర్తి అయ్యాక ఆయనను టీఆర్ఎస్ పూర్తిగా పక్కన పెట్టింది. మొన్న ఎన్నికల సమయంలో స్వామి గౌడ్ తో బీజేపీ నేతలు బండి సంజయ్, లక్ష్మణ్ సమావేశమై పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. దీంతో ఆయన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. 

Read more RELATED
Recommended to you

Exit mobile version