ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ.. నూతనంగా స్విగ్గీ మనీ పేరిట ఓ డిజిటల్ వాలెట్‌ను మంగళవారం లాంచ్ చేసింది. పేటీఎం, అమెజాన్ పేలకు పోటీగా స్విగ్గీ ఈ వాలెట్‌ను ఆవిష్కరించింది. దీంతో స్విగ్గీ ఫుడ్ డెలివరీ యాప్‌లో యూజర్లు ఇతర పేమెంట్ ఆప్షన్లపై ఆధారపడాల్సిన అవసరం లేదు. కేవలం సింగిల్ క్లిక్‌లోనే స్విగ్గీలో యూజర్లు ఫుడ్ ఆర్డర్ చేయవచ్చు.
స్విగ్గీ మనీ డిజిటల్ వాలెట్ యాప్ సేవలను అందించేందుకు గాను స్విగ్గీ.. ఐసీఐసీఐ బ్యాంక్‌తో భాగస్వామ్యం అయింది. దీని ద్వారా యూజర్లు బిల్లు చెల్లింపులతోపాటు ఫుడ్ ఆర్డర్లు చేయవచ్చు. ఇక లాంచింగ్ సందర్భంగా స్విగ్గీ మనీలో పలు డిస్కౌంట్లను కూడా అందిస్తున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు ఎలాంటి డాక్యుమెంట్లు, వెరిఫికేషన్ అవసరం లేకుండానే నేరుగా స్విగ్గీ మనీ వాలెట్ సేవలను ఉపయోగించుకోవచ్చు. ఇక నాన్ ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు ఆధార్, పాన్ వంటి ఐడీ కార్డులను ఉపయోగించి ఈ వాలెట్‌ను యాక్టివేట్ చేసుకుని ఉపయోగించాల్సి ఉంటుంది.
కాగా ప్రస్తుతం స్విగ్గీ దేశంలో 500 ప్రాంతాల్లో తన సేవలను అందిస్తోంది. ఇటీవలే కోవిడ్ లాక్‌డౌన్ నేపథ్యంలో స్విగ్గీ గ్రోసరీ సేవలను కూడా ప్రారంభించింది. తాజాగా ఇప్పుడు డిజిటల్ వాలెట్‌ను లాంచ్ చేసింది.