కేవ‌లం రూ.2,499కే సిస్కా కంపెనీ కొత్త స్మార్ట్‌వాచ్‌..!

-

హోం లైటింగ్, స్మార్ట్ హోం ప‌రిక‌రాల‌ను త‌యారు చేసే సిస్కా కంపెనీ కొత్త‌గా స్మార్ట్‌వాచ్‌ను విడుద‌ల చేసింది. భార‌త వియ‌ర‌బుల్ మార్కెట్‌లోకి ఎంట‌రైన సిస్కా త‌న తొలి స్మార్ట్‌వాచ్‌.. ఎస్‌డ‌బ్ల్యూ100ను ఆవిష్క‌రించింది. ఇందులో 1.3 ఇంచుల టీఎఫ్‌టీ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 11 ర‌కాల భిన్న‌మైన స్పోర్ట్స్ ట్రాకింగ్ మోడ్స్‌ను ఇందులో అందిస్తున్నారు. స్లీప్ ట్రాకింగ్‌, ఐపీ 68 వాట‌ర్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయి.

ఈ వాచ్‌లో స్టెప్ కౌంట‌ర్‌, క్యాల‌రీస్ ఇన్‌టేక్‌, హార్ట్ రేట్ సెన్సార్‌, స్లీప్ ట్రాకింగ్ ఫీచ‌ర్లు కూడా ఉన్నాయి. ఔట్ డోర్ సైక్లింగ్‌, యోగా, హైకింగ్‌, ఔట్‌డోర్ వాకింగ్‌, ఎలిప్టిక‌ల్ ట్రెయిన‌ర్ త‌దిత‌ర యాక్టివిటీల‌ను ఈ వాచ్ ద్వారా ట్రాక్ చేయ‌వ‌చ్చు.

ఈ వాచ్‌లో క‌స్ట‌మ్ వాచ్ ఫేసెస్‌ను పెట్టుకునే సౌక‌ర్యం కూడా క‌ల్పించారు. వాల్‌పేప‌ర్ల‌ను కూడా సెట్ చేసుకోవ‌చ్చు. ఫోన్‌కు వ‌చ్చే కాల్స్‌, సోష‌ల్ మీడియా, క్యాలెండ‌ర్‌, ఇ-మెయిల్ నోటిఫికేష‌న్ల‌ను ఈ వాచ్‌లో చూసుకోవ‌చ్చు. ఈ వాచ్‌ను ఒక్క‌సారి ఫుల్ చార్జింగ్ చేస్తే 15 రోజుల వ‌ర‌కు బ్యాట‌రీ బ్యాక‌ప్ వ‌స్తుంది. రూ.2499 ధ‌ర‌కు సిస్కా ఎస్‌డ‌బ్ల్యూ100 వాచ్‌ను వినియోగ‌దారులు ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version