ట్విట్టర్‌లో కొత్త ఫీచర్.. అదేంటో ఒక్కసారి లుక్కేయండి..!!

-

సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ ట్విట్టర్‌లో ఒక కొత్త ఫీచర్ యాడ్ అవ్వనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌పై పరీక్షలు నిర్వహిస్తున్నారు. సర్కిల్ వారిగా ఈ ఫీచర్‌కు ట్విట్టర్ పేరు పెట్టనుంది. ఈ ట్విట్టర్ సర్కిల్ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. మీరు ట్విట్ చేసిన పోస్టును ఏ యూజర్ చూడాలని అనుకుంటున్నారో వారే చూడగలరు. మిగిలిన వాళ్లు చూడలేరు. అటు ఇటుగా ఇన్‌స్టాగ్రామ్ క్లోజ్ ఫ్రెండ్ ఫీచర్‌ను పోలీ ఉంటుందని సంస్థ వెల్లడించింది.

ట్విట్టర్

ట్విట్టర్ ఈ ఫీచర్‌ను ఐఓఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి తీసుకురానుంది. ఈ సర్కిల్ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత గరిష్టంగా 150 మంది వినియోగదారులకు ట్యాగ్ చేయవచ్చు. అలాగే మీ ట్విట్టర్ అకౌంట్‌లో మీ సన్నిహితులు, స్నేహితులు మాత్రమే ట్విట్ చేసేలా సెట్ చేసుకోవచ్చు. త్వరలో సర్కిల్ ఫీచర్ ట్విట్టర్ వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది.

ఈ ఫీచర్‌కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మీ సర్కిల్‌లో ఎంచుకున్న యూజర్లకు మాత్రమే ట్విట్‌కు రీట్విట్, లైక్ చేయగలరు. సర్కిల్ ఫీచర్‌ను పొందడానికి.. మీరు ముందుగా ట్విట్టర్ అకౌంట్‌లో లాగిన్ అవ్వాలి. ప్రొఫైల్ సెట్టింగ్స్ దగ్గరికి వెళ్లి.. ట్విట్ ఎంపికపై క్లిక్ చేయాలి. అక్కడ ఆడియన్స్ బటన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసినట్లయితే కొత్త సర్కిల్ ఎంపిక పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version