తెలంగాణలో థియేటర్స్ బంద్ అంటూ ప్రచారం.. కీలక ప్రకటన చేసిన మంత్రి !

-

కొద్దిరోజులుగా తెలంగాణలో కరోనా కేసులు విజృంభిస్తున్న కారణంగా థియేటర్లు కూడా మూసివేస్తారు అని ప్రచారం జరుగుతూ వస్తోంది. దానికి సంబంధించి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. సినిమా థియేటర్లు మూసివేత పై ఒక రకంగా తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినట్లయింది. సినిమా థియేటర్లు మూసివేయడం లేదు అని పేర్కొన్న మంత్రి తలసాని సినిమా ధియేటర్లు మూసివేస్తారు అంటూ జరుగుతున్న ప్రచారం నమ్మవద్దని కోరారు.. కోవిడ్ నిబంధనలతో థియేటర్ లు నడుస్తాయని ఆయన పేర్కొన్నారు.

కొద్ది రోజులుగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణలో కూడా లాక్ డౌన్ విధిస్తారు అంటూ ప్రచారం జరుగుతూ వస్తోంది. కానీ దానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వం క్లారిటీ ఇస్తూనే ఉంది. అయినా ఈ ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఎప్పుడూ ఏదో ఒక రకమైన ప్రచారం మళ్ళీ తెరమీదకు వస్తూనే ఉంది. ఇక ముందు 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో థియేటర్లు నడిచాయి. తరువాత 100 శాతానికి పెంచారు కేసులు పెరిగితే సామర్థ్యం తగ్గించే అవకాశం ఉంటుందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version