కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్కకు తెరాస మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గట్టి షాకిచ్చారు. గురువారం ఉదయం ప్రత ఇపక్ష నేత ఇంటికి వచ్చి ఊహించని షాకిచ్చారు. బుధవారం కాంగ్రెస్ నేత భట్టి శాసన సభలో తెరాసపై ఘాటు విమర్శలు చేశారు. లక్ష డబుల్ బెడ్‌రూమ్ లు ఎక్కడ కట్టారో చూపించాలని సవాల్ చేశారు. ఈ సవాల్‌ని స్వీకరించిన తలసాని నేరుగా గురువారం భట్టి ఇంటికి వెల్లడం రాకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఊమించని విధంగా తలసాని తన ఇంటికి రావడంతో కంగుతిన్న భట్టి ఆ తరువాత తేరుకుని లోనికి ఆహ్యానించారు. తరువాత ఇద్దరు కలిసి ఒకేకారులో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లని సందర్శించడం కోసం వెల్లడంతో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్‌లో మౌళిక వసతులపై బుధవారం అసెంబ్లీలో చర్చ జరిగింది. ఆ తరువాత దీనిపై భట్టి ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ అభివృద్ధి తమ పార్టీ చలవేనని, అధికార పార్టీ చేసిందేమబీ లేదని, రాష్ట్రాన్ని దివాళా తీయించారని మండి పడ్డారు.
ఈ చర్చ సందర్భంగానే భట్టి డబుల్ బెడ్రూమ్‌ల నిర్మాణంపై విమర్శలు చేశారు. ఈ విమర్శల్ని సీరియస్‌గా తీసుకున్న తలసాని శ్రీనివాస్‌యాదవ్ గురువారం భట్టి విక్రమార్క ఇంటికే వెళ్లడం , అక్కడి నుంచి అధికారుతలో కలిసి ఒకే కారులో డబుల్ బెడ్రూమ్‌ల తనిఖీకి వెల్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది.