రహస్య కెమెరాల విక్రయంపై తెలంగాణ హై కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు అయ్యింది. రహస్య కెమెరాల భహిరంగ విక్రయాన్ని సవాలు చేస్తూ హెవెన్ హోమ్స్ సొసైటీ పిటిషన్ దాఖలు చేసింది. ఇలా భహిరంగనగా రహస్య కెమెరాలను మార్కెట్, ఆన్లైన్లో నేరుగా విక్రయిస్తున్నారు అని చెప్పిన పిటిషనర్.. కొందరు హోటళ్లు, షాపింగ్ మాల్స్‌లో రహస్య కెమెరాలు పెడుతున్నారన్నారు అని తెలిపారు.
అలాగే వాష్ రూమ్ లు, ఎక్స్‌రే గదుల్లో కూడా కొందరు రహస్య కెమెరాలు పెడుతున్నారన్న పిటిషనర్.. ఈ రహస్య కెమెరాల విక్రయాలపై నియంత్రణ ఆదేశాలు జారీ చేయాలి అని కోరారు పిటిషనర్. అయితే ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను చేర్చారు పిటిషనర్. అయితే ఈ పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరారు కేంద్రం తరఫు న్యాయవాది. అయితే వచ్చే నెల 28వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని హై కోర్టు ఆదేశం ఇచ్చింది. ఇక దీని పై తదుపరి విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది.