ఈ క్షణం.. తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణం : మంత్రి తలసాని

-

ప్రతిష్టాత్మక 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. ఏకంగా 10 పురస్కారాలు తెలుగు సినీ పరిశ్రమకు దక్కాయి. వాటిలో ఒక్క RRR సినిమాకే ఆరు అవార్డులు దక్కడం విశేషం. ‘పుష్ప: ది రైజ్’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డును దక్కించుకున్నారు. తెలుగు సినిమా చరిత్రలో జాతీయ ఉత్తమ నటుడు అవార్డు పొందిన తొలి హీరోగా అల్లు అర్జున్ నిలిచారు. అల్లు అర్జున్‌ కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ కు ఎంపికవడం తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణమని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ అన్నారు. ఈ మేరకు హీరో అల్లు అర్జున్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ట్రిపుల్ ఆర్ సినిమాకు కూడా పలు అంతర్జాతీయ అవార్డులు రావడం నిజంగా ఎంతో ఆనందించ దగిన విషయమన్నారు.

జాతీయ స్థాయి అవార్డులతో తెలుగు వారి ఆత్మగౌరవం మరింత పెరిగిందన్నారు. అలాగే రాష్ట్ర చ‌ల‌న‌చిత్ర‌, టీవీ, థియేట‌ర్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మన్ అనిల్ కుర్మాచ‌లం కూడా శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఇప్పటికే ఆస్కార్‌ విన్నర్‌గా నిలిచిన ఆర్‌ఆర్‌ఆర్ (RRR)సినిమాకు తాజా నేషనల్‌ అవార్డుల్లో వివిధ విభాగాల్లో 6 పురస్కారాలు దక్కాయి. పుష్ప సినిమాకు అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపికై తిరుగులేని ట్రెండ్‌ సెట్‌ చేశాడు. ఇదే సినిమాకు ఉత్తమ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా దేవీ శ్రీ ప్రసాద్‌ నిలిచాడు. ఉత్తమ గేయ రచయిత చంద్రబోస్ ‌(కొండపొలం), ఉత్తమ సినిమాగా ఉప్పెన ఒక్కో అవార్డు అందుకున్నాయి.

ఆర్‌ఆర్‌ఆర్‌కు విభాగాల వారీగా..
బెస్ట్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌: కింగ్ సోలోమన్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)
బెస్ట్‌ కొరియోగ్రఫర్‌గా ప్రేమ్‌రక్షిత్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)
బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ : ఎంఎం కీరవాణి
ప్లేబ్యాక్ సింగర్‌ : కాలభైరవ (ఆర్‌ఆర్‌ఆర్‌)
బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్‌ : ఆర్ఆర్‌ఆర్‌
బెస్ట్ పాపులర్ సినిమా : ఆర్‌ఆర్‌ఆర్‌

Read more RELATED
Recommended to you

Exit mobile version