గాల్లో కాల్పులు జరిపిన తాలిబన్లు.. నిరసనకారులపై ఉక్కుపాదం..!

-

ఆప్ఘనిస్తాన్ దేశాన్ని తాలిబన్లు వశం చేసుకున్న సంగతి అందరికీ విదితమే. దాంతో దేశం నుంచి జనం పారిపోతున్నారు. కాబుల్ ఎయిర్ పోర్టులో భారీ సంఖ్యలో జనం విమానాల కోసం ఎదురు చూస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, దేశంలో కొందరు నిరసన కారులు తాలిబన్ల పాలన మాకు వద్దు అని నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఆప్ఘనిస్తాన్ జాతీయ జెండాతో నిరసన తెలిపారు.

దాంతో తాలిబన్లు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. గాల్లో కాల్పులు జరిపి నిరసనకారులను చెదరగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ఘటన ఆప్ఘనిస్తాన్‌లోని జలలబాద్ సిటీలో జరిగింది. ఈ పరిస్థితులను బట్టి చూస్తే ఆప్ఘనిస్తాన్‌లో ఇక ఆరాచకమే రాజ్యమేలే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

తాలిబన్ల జెండాను నిరసిస్తూ ఆప్ఘనిస్తాన్ జాతీయ జెండాను ప్రదర్శించినందుకుగాను నిరసనకారులపై కాల్పులు జరిపేందుకు యత్నించారు తాలిబన్లు. దీన్ని బట్టి భవిష్యత్తులో హక్కుల గురించి ఎవరైనా మాట్లాడితే ఇక వారిని అంతం చేస్తారని కొందరు పేర్కొంటున్నారు. ఆప్ఘనిస్తాన్ దేశ ప్రధాని అశ్రఫ్ గనీ దేశాన్ని విడిచి పారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆప్ఘనిస్తాన్ నుంచి ఎవరినీ ఇక బయటకు రానివ్వట్లేదు. అదే సమయంలో కాందహార్, కాబుల్, మజర్-ఐ-షరీఫ్ వంటి సరిహద్దులకు ఆనుకుని ఉన్న నగరాల నుంచి వెలుపలికి వెళ్లే రోడ్స్‌ను ఇప్పటికే తాలిబన్లు బ్లాక్ చేశారు. దేశంలోని నగరాలన్నింటినీ తమ ఆధీనంలోకి తీసుకున్నారు తాలిబన్లు. ఈ పరిస్థితులను చూసి తాలిబన్ల పరిపాలన నుంచి ఆఫ్ఘన్ దేశ పౌరులు ఎందుకు భయపడి పారిపోవాల్సి వచ్చిందనడానికి ఈ పరిస్థితులు నిదర్శనంగా కనబడుతున్నాని పలువురు చెప్తున్నారు. తాలిబన్ల దురాగతాలు ఇంకా మున్ముందు చాలా ఉండబోతున్నాయని, ఇవి జస్ట్ టీజర్స్ లాంటివేనని అంటున్నారు. మొత్తంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చేసిన తాలిబన్లు దేశమంతా అల్లకల్లోల పరిస్థితులు సృష్టించబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version