తమన్నా: పాన్ ఇండియాను ఒక్క మాటలో తీసిపారేసిందేంటి..?

-

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ డం గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇకపోతే ప్రభాస్ ని బాహుబలి సంచలన విజయంతో పాన్ ఇండియా స్టార్ అని పిలిచారు. ఇక బాహుబలి ఫ్రాంచైజీతో దాదాపు రూ. 2000 కోట్లు కొల్లగొట్టిన స్టార్ గా ప్రభాస్ స్టార్ గురించి దేశ విదేశాల్లో కూడా మారుమ్రోగిపోయింది. ఇక ఆ తర్వాత కేజిఎఫ్ ఫ్రాంచైజీ తో యష్ బృందం ఏకంగా రూ.1000 కోట్ల క్లబ్లో ప్రవేశించగా.. ఆర్ఆర్ఆర్ చిత్రంతో రాజమౌళి మరొకసారి వెయ్యి కోట్ల క్లబ్ ని రిపీట్ చేశాడు. ఇక ఈ సినిమా ద్వారా అటు రామ్ చరణ్, ఇటు ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోలుగా అవతరించారు. ఇకపోతే తెలుగు స్టార్ల ఎదుగుదల పాన్ ఇండియా స్టార్ డం ల త్రయానికి కూడా ఇంకా డైజెస్ట్ అవ్వడం లేదు.. బచ్చన్ లు, రోషన్ లు, కపూర్ లకు కూడా సౌత్ లో అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదు.

ప్రస్తుతం ఇలాంటి కన్ఫ్యూజన్ లో హిందీ తారలంతా సౌత్ డైరెక్టర్లు సౌత్ స్టార్లతో కలిసి మల్టీస్టారర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.. ఇకపోతే ఇటీవల పూర్తి సౌత్ టాలెంట్ పైనే ఖాన్ లు సైతం డిపెండ్ అవుతున్నారు. అయితే ఇలాంటి సమయంలో తమన్నా చేసిన ఒక వార్త బాగా దుమారం రేపింది. అసలు పాన్ ఇండియా స్టార్ డం అనేది అమితాబచ్చన్ షారుఖ్ ఖాన్ ల తోనే ముగిసింది అని మిల్క్ బ్యూటీ తమన్న హాట్ కామెంట్ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇక పాన్ ఇండియా అనేది పెలుసైన పదం అంటూ అసహ్యం వ్యక్తం చేసింది తమన్నా..

పాన్ ఇండియా స్టార్ డం అనే భావనపై తన మనసులోని మాటను అస్సలు దాచుకోలేదు. దీనిపై బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం తో మరొకసారి వార్తల్లో నిలిచింది. ఇకపోతే తమన్నా ప్రస్తుతం హిందీలో కూడా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version