నటి కస్తూరి కోసం ఏపీలో గాలిస్తున్న తమిళనాడు పోలీసులు

-

నటి కస్తూరి గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ఈమె తెలుగు అన్నమయ్య సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది. అయితే ఈమె ఇటీవలే తమిళనాడులో స్థిరపడిన తెలుగు వారిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడింది. ప్రస్తుతం నటి కస్తూరి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. కస్తూరికి ఇటీవలే నోటీసులు ఇచ్చేందుకు చెన్నై పోలీసులు ప్రయత్నించగా.. ఆమె ఇంటికి తాళం వేసి కనిపించింది. దీంతో ఆమె పరారీలో ఉన్నట్టు నిర్థారించారు పోలీసులు.

Kasturi

ముందస్తు బెయిల్ కోరుతూ కస్తూరి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా.. ఆమె పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ నేపథ్యంలో చెన్నై పోలీస్ కమిషనర్ తాజాగా కస్తూరి కోసం ఓ స్పెషల్ పోలీస్ టీమ్ ను ఆంధ్రప్రదేశ్ కి పంపించారు. కస్తూరి ఏపీలో ఉండవచ్చనే అనుమానంతో చెన్నై పోలీసులు ఏపీలో గాలిస్తున్నారు. కస్తూరి తమిళనాడు నుంచి పారి పోవడానికి ఓ కోలీవుడ్ నిర్మాత సహాయపడినట్టు తెలుస్తోంది. బీజేపీ కూడా ఆమెను దూరం పెట్టినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version