తెలంగాణ బడ్జెట్ సమావేశాల నోటిఫికేషన్ జారీ చేసిన తమిళిసై

-

తెలంగాణ బడ్జెట్ సమావేశాల నోటిఫికేషన్ ను జారీ చేశారు గవర్నర్ తమిళిసై. మంగళవారం ఈ నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నేపథ్యంలో వచ్చేనెల మూడవ తేదీ నుండి ఉభయ సభల సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 3వ తేదీ నుండి ఉభయ సభల సమావేశాలు ప్రారంభం కానుండగా.. ఆ రోజున మధ్యాహ్నం 12:10 గంటలకు ఇరుసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు.

ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ నోటిఫికేషన్ జారీ చేశారు. గత సమావేశాలకు కొనసాగింపుగానే ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉభయ సభలను ప్రోరోగ్ చేయకుండానే బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు గవర్నర్ విడుదల చేసిన నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version