కరోనా సంక్రమణం రోజురోజుకి పెరిగిపోతుంది.. పెద్ద నగరాల్లో కరోనాను అరికట్టడం దాదాపుగా అసాధ్యం అన్న స్థాయికి కరోనా పెరిగిపోతుంది. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, హైదరబాద్ మరియు చెన్నై నగరాల్లో కరోనా వ్యాప్తి తారా స్థాయికి చేరుతుంది. ఈనేపద్యంలో తమిళనాడు ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది చెన్నై నగరం సహా మరికొన్ని ప్రాంతాల్లో మరోసారి లాక్ డౌన్ అమలుచేసేందుకు నిర్ణయం తీసుకుంది. సోమవారం అర్ధరాత్రి నుంచి ఈనెల 30వ తేదీ వరకు సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. కాంచీపురం, చెంగల్పట్టు, తిరువ ళ్లూర్ జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండడంతో ఈనెల 19వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సంపూర్ణ లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. కాగా కేవలం మధురై జిల్లాలో ఆదివారం ఒక్కరోజే 68 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దాంతో జిల్లాలోని మొత్తం కరోనా కేసుల సంఖ్య 705 కు చేరింది. లాక్ డౌన్ సమయంలో దుకాణాలకు ఉదయం 6 నుండి 2 గనతల వరకు పర్మిషన్ జారీ చేస్తూ సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించింది.
ఆ రాష్ట్రంలో మరోసారి సంపూర్ణ లక్ డౌన్..! కారణాలు ఇవే…!
-