తమిళనాడు పంచాయతీ ఎన్నికల్లో డీఎంకే ఆధిక్యం..

-

తమిళనాడు పంచాయతీ ఎన్నికల్లో అధికారి డీఎంకే పార్టీ దూసుకెళుతోంది. 9 జిల్లాల్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. మొత్తం 1381 పంచాయతీ యూనియన్ వార్డు మెంబర్ పోస్టుల్లో దాదాపు 1100 చోట్ల లీడ్ లో ఉంది. మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమైన ఓట్ల లెక్కింపు 74 కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరగుతోంది. డీఎంకె అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం స్టాలిన్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సుపరిపాలను ప్రయత్నిస్తున్నారు. ప్రజలకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో ప్రజల్లో డీఎంకేకు మరింత ఆదరణ లభించింది. మరోవైపు డీఎంకే ప్రధాన ప్రతిపక్షం ఏఐడీఎంకే ఎన్నికల్లో తేలిపోయింది. డీఎంకే ముందు నిలువలేకపోయింది. డీఎంకే మిత్రపక్షం అయిన లెఫ్ట్ పార్టీ కొన్ని జిల్లాల్లో ఒంటరిగా పోటీ చేసింది. కల్లుకురిచ్చి జిల్లాలో బీజేపీ ఒంటరిగా పోటీచేస్తుంది. మరోవైపు విజయ్ ఫ్యాన్స్ కూడా ఈ ఎన్నికల్లో సత్తా చాటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version